Sunday, May 01, 2011

ఇంకోసారి

ఇంకోసారి అమ్మ చేతి గోరుముద్దల రుచి చూడాలి
ఇంకోసారి జ్వరంగా ఉంది అని అమ్మ వడిలో పడుకోవాలి
ఇంకోసారి అన్నయ్య మీద అమ్మకి చాడీలు చెప్పాలి
ఇంకోసారి అమ్మ చేతి చెంపదెబ్బ తినాలి

ఇంకోసారి నాన్న భుజాలు ఎక్కి గుడి గంటలు కొట్టాలి
ఇంకోసారి నాన్న ఉద్యోగానికి వెళ్లాడు అని గంతులు వెయ్యాలి
ఇంకోసారి నాన్న అడుగుల చప్పుడుతో నిద్రలేవాలి
ఇంకోసారి నా విజయంలో నాన్న గర్వం చూడాలి

ఇంకోసారి నా మొదటి ఏడుపు తో సంతోషాన్ని పంచాలి
ఇంకోసారి ఇదే అన్నయ్యకి తమ్ముడిని కావాలి
ఇంకోసారి తొలి ప్రేమలోని తియ్యదనం ఆస్వాదించాలి
ఇంకోసారి నేను నా బాల్యం జీవించాలి

ఇంకోసారి ఇంకోసారి అనే వరం పొందాలి

11 comments:

Giridhar said...

it seems that you are missing everyone back home!!!

Vinil said...

actually I had thought to write about this long time ago, it just worked out now :)

Geetha said...

ఇంకోసారి నీ కవిత నే చదవాలి...

Vamshidhar Kudikala said...

చాలా బాగుంది

Unknown said...

nice...ee line chaala baagundhi "ఇంకోసారి ఇంకోసారి అనే వరం పొందాలి"

Unknown said...

ఇంకోసారి ....once more...
Nice one bava...

Anonymous said...

Bagundi abbai..

Ramana KV said...

Good one Vinil..
Keep writing more...

ramana murthy said...

శిష్యా !
నీ వచన కవిత్వం అదిరింది. నిజంగానే పీచుమిఠాయి తినినంత తీయగాను ....అమ్మ మనసంత గొప్పగాను వుంది . కానీ.....'చెత్త-చెదారం' అనే శీ్ర్షిక క్రింద రాయడం మాతం అస్సలు బాగోలేదు.
యెందుకంటే అన్ని మానవీయ ఆప్యాయతా అనుబంధాలను గుర్తుకుతెచ్హే కవిత చెత్త-చెదారం యెలా అవుతుంది. నీ నుంచి మరిన్ని ఆశిస్తున్నా !
మరచిపోయా.....అసలు నువ్వు చదవవలసిన బ్లాగు ఇదీ !
http://madhuramesudhaaganam.blogspot.com/2010/04/blog-post.html

ramana murthy said...

లింకు....సెలెక్ట్ కావడం లేదు మరొసారి పంపుతా !

http://madhuramesudhaaganam.blogspot.com/

Anantharam said...

Vinil.. nuvvu raasavaaa idi.. neelo ok kavi unnadani chaala late ga gurtincha.. nee kavitha lo chaala information undi mama.. ;) jk.

Baagundi raaaa.. malli continue cheyyaledaaa?? as I see 2011 lo raasinattunnavv